తెలుగు సినిమా ప్రతిష్టను ప్రపంచ పటంలో పెట్టనున్న కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన ప్రపంచ అంతటా రిలీజ్ కానున్న సంగతి అందరికి తెలిసిందే. సాదారణంగా బారి వ్యయం తో తీసిన సినిమా లకు అందరూ ఊహించినట్టుగానే టికెట్ రేట్లను పెంచుకొనే వెసులుబాటు మన రెండు తెలుగు రాష్ట్ర ప్రబుత్వాలు కల్పిస్తూ వస్తునాయి, తాజాగా KALKI 2898 AD కి కూడా టికెట్స్ రేట్స్ పెంచుతూ రెండు ప్రబుత్వాలు జీవోను జారీ చేసాయి. దాంతో గత కొద్ది ఏళ్లుగా ఏపీ ప్రభుత్వంతో సాగుతున్న వివాదానానికి తెరపడింది.
KALKI 2989 AD Advance Booking Tickets Available |
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తెలుగు సినిమా పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని ఇండస్ట్రీ లో చర్చ జరుగుతుంది.
ఏపీలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం తెలుగు సినిమా రంగంపై
ఇప్పటి వరుకు ఉన్న ఆంక్షలను రద్దు చేస్తూ సినిమా రంగం పై వరాలు కురిపించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన KALKI 2898 AD సినిమాకు టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం
అనుమతి ఇచ్చింది. పెంచిన టికెట్ రేట్లు జూన్ 27వ తేదీ నుంచి
జూలై 10వ తేదీ వరకు సుమారుగా 14
రోజులపాటు అమల్లో ఉంటాయి.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన
సమయంలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకొనేందుకు, అదనపు షోలకు అనుమతి కోరుతూ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దరఖాస్తు
చేసుకొన్నది. దాంతో సానుకూలంగా స్పందిస్తూ సింగిల్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 125 రేటు పెంచుతూ అనుమతి ఇచ్చింది. నైజాంలో టికెట్ రేట్ల విషయానికి వస్తే..
మల్టీప్లెక్స్‌లో 2D వెర్షన్ టికెట్ ధర 395 రూపాయలు కాగా, అదనపు ఛార్జీలతో కలిపి ఈ టికెట్ ధర 435 రూపాయలుగా నిర్ణయించారు. ఇక సింగిల్ థియేటర్లో టికెట్ ధర 250 రూపాయలు కాగా, ట్యాక్స్‌లతో కలిపి మొత్తం 283 రూపాయలుగా నిర్ణయించారు. ఈ రేట్లు దాదాపు 14
రోజులపాటు అమలులో ఉంటాయి.
kalki 2898 AD Tickets Available |
ఇక కల్కి 3డీ వెర్షన్ విషయానికి వస్తే.. మల్టీప్లెక్స్‌లో ఈ టికెట్ ధర 445 రూపాయలు కాగా, అదనపు పన్నులతో కలిపి 487రూపాయలుగా నిర్ణయించారు. ఇక సింగిల్ థియేటర్లో టికెట్ ధర 245 రూపాయలు కాగా, పన్నులతో కలిపి మొత్తంగా 274 రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఏపీలో కూడా టికెట్ రేట్లు ఇదే నిష్పత్తిలో పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 2డీ, 3డీ వెర్షన్స్‌కు కూడా ప్రభుత్వం అనుమతించిన మేరకు టికెట్ రేట్లు వర్తిస్తాయని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు వెల్లడించారు. టికెట్ రేట్ల పెంపుతో ట్రేడ్ వర్గాలు సంతోషంలో ఉన్నారు.